10 August, 2026 | 10:21 AM

కరాటే బెల్ట్ సర్టిఫికెట్ల ప్రదానం

10-08-2026 08:57 AM

ఓకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ ఆధ్వర్యంలో ఘనంగా కరాటే బెల్ట్, సర్టిఫికెట్ల ప్రదానం.

బోధన్, (విజయక్రాంతి): బోధన్ పట్టణంలో ఆదివారం ఓకినావా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ స్కూల్ ఆఫ్ కరాటే ఆధ్వర్యంలో కరాటే బెల్టులు, సర్టిఫికెట్ల ప్రదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అకాడమీ చీఫ్ ఇన్‌స్ట్రక్టర్  సలాం మాస్టర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమానికి బోధన్ పట్టణ సీఐ వెంకట నారాయణ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బెల్టులు, సర్టిఫికెట్లను అందజేశారు. కరాటేలో ప్రతిభ కనబరిచి శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులకు వివిధ స్థాయిల బెల్టులను ప్రదానం చేశారు. బ్లాక్ బెల్ట్ సాధించిన వారిలో రష్మి, కృష్ణ, పి. ఆర్య, పి. అవంతిక ఉన్నారు. బ్రౌన్ బ్లాక్ బెల్ట్ను జావెరియా ఫాతిమా, బ్రౌన్ బెల్ట్ను పి. నాగ వివాంశ్ సాధించారు.

అదేవిధంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన నూరత్ బేగం, అఫ్షాన్ జబీన్,  నబీల్, రష్మి, కృష్ణ, విశ్వజిత్‌లను ఈ సందర్భంగా సీఐ వెంకట నారాయణ, అకాడమీ నిర్వాహకులు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా సీఐ వెంకట నారాయణ మాట్లాడుతూ.. కరాటే శిక్షణ విద్యార్థుల్లో క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం, శారీరక దృఢత్వంతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలను పెంపొందించేందుకు ఎంతో దోహదపడుతుందని అన్నారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలు, మార్షల్ ఆర్ట్స్‌లోనూ రాణించాలని సూచించారు. చీఫ్ ఇన్‌స్ట్రక్టర్. సలాం మాస్టర్ మాట్లాడుతూ విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన నాణ్యమైన కరాటే శిక్షణ అందిస్తున్నామని తెలిపారు. బెల్టులు, సర్టిఫికెట్లు అందుకున్న విద్యార్థులను తల్లిదండ్రులు, అకాడమీ నిర్వాహకులు అభినందించారు.