21 August, 2026 | 1:54 AM

తెలంగాణలో దోపిడీ పాలన

21-08-2026 01:14 AM
  1. రెవెన్యూ శాఖ బ్రోకర్ దందా చేస్తున్నది
  2. నిషేధిత జాబితాలో పేదల భూములు
  3. మంత్రి పొంగులేటి రాజీనామా చేయాలి
  4. రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): తెలంగాణలో దోపిడీ పాలన నడు స్తున్నదని, ప్రజల ఆస్తులను కాపాడాల్సిన రెవెన్యూ శాఖ బ్రోకర్ దందా చేస్తున్నదని రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కే లక్ష్మణ్ విమర్శించారు. మంత్రి పొంగులేటి క్షమాపణ చెప్పడం సిగ్గుచేటని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌చేశారు.

అధికా రంలోకి వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పిన వారు సామా న్యుల ఆస్తులను ఇప్పుడు ఏరకంగా బంగాళాఖాతంలో వేస్తున్నారని ప్రశ్నించారు. ఎవ రు చెప్తే భూములను నిషేధిత జాబితాలో పెట్టారో మంత్రి పొంగులేటి చెప్పాలని నిలదీశారు. గురువారం ఢిల్లీలో మీడియాతో లక్ష్మణ్ మాట్లాడారు.

ఘట్‌కేసర్ మండలంలోని కొర్రేముల గ్రామానికి చెందిన చిన్నచి న్న రైతులు తమ భూములను నిషేధిత జాబితాలోకి వెళ్లాయని కలెక్టర్‌కు దరఖాస్తు చేసు కున్నారని తెలిపారు. పేదల భూములు నిషేధిత జాబితాలో పెట్టడంతో ప్రజలు తీవ్ర ఇ బ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రజలు ఎమ్మార్వోల చుట్టూ తిరిగే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదని పేర్కొన్నారు. 

నిషేధిత జాబితాలో నాడు 22 లక్షల ఎకరాలు.. నేడు కోటి ఎకరాలు

రాష్ట్రంలో పాలకులు భూదందాలు చేస్తూ ప్రజల భూములను లూటీ చేస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇల్లు నిషేధి త జాబితాలో చేరిందని వెల్లడించారు.  కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రియల్ ఎస్టే ట్ వ్యాపారంగా నడిపిస్తున్నారని ఆరోపించారు. మంత్రి పొంగులేటి శ్రీని వాస్ రెడ్డి క్షమాపణలు చెప్పడం సిగ్గు చేటన్నారు. అధికారులను బాధ్యులుగా చేయడం కాదని.. దీనికి ఆదేశించిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు.

22ఏ  భూ ములపై సీబీఐ విచారణకు ఆదేశించాలని.. రాహుల్‌గాంధీ, మల్లికార్జున ఖర్గే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. భూములు నిషేధిత జాబితాలో పెట్టారని స్వయంగా మంత్రి కోమటిరెడ్డి బహిరంగ వ్యాఖ్యలు చేశారని గుర్తుచేశారు. తెలంగాణలో భూము ల పేరుమీద కుంభకోణాలు, దందాలు బయటపడుతున్నాయని తెలిపారు. బీఆర్‌ఎస్ హయాంలో భూములు కాజేయాలని చూస్తే రేవంత్‌రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా పోరా టం చేశారని గుర్తుచేశారు.

బీఆర్‌ఎస్ హ యాంలో 22 లక్షల ఎకరాలు నిషేధిత జాబితాలో అంటే.. ఇప్పు డు కాంగ్రెస్ ప్రభుత్వం కోటి ఎకరాలను నిషేధిత జాబితాలోకి నెట్టిందని విమర్శించారు.  తెలంగాణ ప్రజల ఆస్తు లు భద్రంగా ఉండాలంటే ఆర్మీని దింపాలని ఇటీవల హైకోర్టు వ్యాఖ్యలు చేసిందని గుర్తుచేశారు. ఎవరి ఇళ్లు ఎప్పుడు నిషేధిత జాబితాలోకి వెళ్తుందో అని ప్రజలు భయపడుతున్నారని పేర్కొన్నారు.