21 August, 2026 | 3:52 AM

నాన్ మ్యాపింగ్ ఓటర్లకు నోటీసులు జారీ చేయాలి

21-08-2026 01:53 AM

జిల్లా కలెక్టర్ కె.హరిత

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగం గా మ్యాపింగ్ కాని ఓటర్లకు వెంటనే నోటీసులు జారీ చేసి, నిర్ణీత గడువులోగా వారి నుంచి అవసరమైన ఆధారాలను స్వీకరించాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు.

గురువారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఆర్డీవోలు లోకేశ్వర్రావు, చెన్నూరి కిష్టయ్యలతో కలిసి తహసీల్దార్లు, సూపర్వైజర్లతో జూమ్ సమావేశం నిర్వహించారు.జిల్లాలో 20,929 మంది నాన్ మ్యాపింగ్ ఓటర్లు ఉన్నారని, వారందరికీ నోటీసులు అందించి ఎన్నికల సంఘం సూచించిన ఆధారాలను స్వీకరించాలని సూ చించారు.అక్టోబర్ 5లోగా నాన్ మ్యాపింగ్ ఓటర్ల హియరింగ్ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో తహసీ ల్దార్లు, సూపర్వైజర్లు, ఎన్నికల విభాగం అధికారులు తదితరులు పాల్గొన్నారు.

వరి ధాన్యం కొనుగోలుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

జిల్లాలో 2026 ఖరీఫ్ సీజన్ వరి ధాన్యం కొనుగోళ్లకు అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు.గురువారం కలెక్టరేట్లో జిల్లా అదనపు కలెక్టర్లు యువరాజ్ మర్మాట్, ఎం.డేవిడ్, కాగజ్నగర్ ఆర్డీవో చెన్నూరి కిష్టయ్యతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 23,934 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు.

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు. సంచులు, తూకం యంత్రా లు, తేమ కొలిచే యంత్రాలు, ప్యాడీ క్లీనర్లు, డ్రయర్లు, టార్పాలిన్ కవర్లకు సంబంధించి అవసరమైన ఇండెంట్ను ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి వాజిద్ అలీ, జిల్లా మేనేజర్ రజిత, మార్కెటింగ్ అధికారి అశ్వక్ అహ్మద్, సహాయ పౌరసర ఫరాల అధికారి సాదిక్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.