21 August, 2026 | 5:02 AM

ఇచ్చోడలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం

21-08-2026 01:51 AM
  1. తనిఖీలలో 110 ద్విచక్ర వాహనాలు, ఆటో, 4 కార్లు స్వాధీనం
  2. ఉట్నూర్ ఏఎస్పీ రూత్విక్ సాయి కొట్టే

ఇచ్చోడ, ఆగస్టు 20 : ఇచ్చోడ మండలంలోని ఇస్లాంపుర గ్రామంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని గురువారం తెల్లవారు జామున నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచే సుమారు 150 మంది పోలీసు అధికారులు, సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టి 110 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటో, నాలుగు కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఫేక్ నెంబర్ ప్లేట్లు అమర్చిన 15 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు.

ఈ సందర్భంగా ఉట్నూర్ ఏఎస్పి రుత్వీక్ సాయి కొట్టే మాట్లాడుతూ జిల్లాలో ఆసాంఘిక, చట్టవ్యతిరేక కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. ముఖ్యంగా గంజాయి నిర్మూలనకు జిల్లా పోలీసులు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని, గంజాయి సేవించడం, నిల్వ ఉంచడం, రవాణా చేయడం, సరఫరా చేయడం లేదా విక్రయించడం వంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన కేసులు నమోదు చేసి చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి కమతం ఇంద్ర వర్ధన్, సిఐలు సిహెచ్ రమేష్, కె నరేష్ కుమార్, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు డి వెంకటి, టి. మురళి, ఎన్ చంద్రశేఖర్, ఎస్త్స్రలు, రిజర్వ్ సిబ్బంది పాల్గొన్నారు.