2 September, 2026 | 10:26 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో ప్రీ-బిడ్

23-06-2026 | 12:00am

మోకిలా లేఅవుట్ ప్రాజెక్టు స్థలంలో నిర్వహణ

హైదరాబాద్, జూన్ 22 (విజయక్రాంతి): హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్‌ఎండీఏ) ఆధ్వర్యంలో ప్రతిపాదిత మోకిలా లేఅవుట్‌కు సంబంధించి సోమవారం ప్రాజెక్టు స్థలంలో ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి 150 మందికి పైగా భావి బిడ్డర్లు హాజరయ్యారు. వై.సుదర్శన్ (డిప్యూటీ కలెక్టర్, హెచ్‌ఎండీఏ) మోకిలా లేఅవుట్ ముఖ్యాంశాలను వివరించారు.

ఎ.రవీందర్‌రెడ్డి (చీఫ్ ప్లానింగ్ ఆఫీస ర్, హెచ్‌ఎండీఏ) లేఅవుట్ ప్రణాళికా అంశాలు, అభివృద్ధి ప్రతిపాదనలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేశారు. సిద్ధార్థ్ (ఎంఎస్టీసీ ప్రతినిధి) ఈ ప్రక్రియ, నమోదు విధానం, బిడ్డర్ల భాగస్వామ్య మార్గదర్శకాల గురించి వివరించారు. అప్పారావు (సూపరింటెండింగ్ ఇంజనీర్, హెచ్‌ఎండీఏ) స్థలంలో చేపట్టిన అభివృద్ధి పనులపై వివరించారు. కళ్యాణ్ (కేపీఎంజీ ప్రతినిధి) మో కిలా లేఅవుట్ ప్రత్యేకతలపై పీపీటీ సమర్పించారు. 200 మందికి పైగా భావి బిడ్డర్లు కా ర్యక్రమంలో పాల్గొని, 29, 30 తేదీల్లో జరి గే ఈ విశేష ఆసక్తిని వ్యక్తం చేశారు.