2 September, 2026 | 9:36 PM

Breaking News

పెరిక్స్ పై ఇన్కమ్ టాక్స్ రద్దుకు అంగీకరించిన యాజమాన్యం   •   రెవరెండ్ డాక్టర్ గుండెపాక వెంకన్నకు ది ఐకానిక్ ఇండియా అవార్డు   •   గంజాయి సాగుచేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు   •   శేషగిరిరావును పరామర్శించిన జనసేన రాష్ట్ర నాయకులు డా గడల శ్రీనివాసరావు   •   నాలుగు క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం పట్టివేత   •   అక్రమ కేసులు ఎత్తివేయాలి: రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌రావు   •   కాంగ్రెస్‌ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్‌ నిరసన   •   క్యాంప్ ఆఫీస్‌పై దాడి హేయమైన చర్య: ఎమ్మెల్యే కుంభం   •   మునిప‌ల్లి ఎస్సీ హాస్ట‌ల్‎ను త‌నిఖీ చేసిన చైర్మ‌న్, మండ‌ల ప్ర‌త్యేకాధికారి   •   పదవులు నా వెంట రావాలి.. భవిష్యత్ సీఎం నేనే!   •  

వరల్డ్‌కప్‌లో ఈజిప్ట్ సంచలనం

23-06-2026 | 12:00am

టోర్నీ చరిత్రలో తొలి విజయం

వాంకోవర్: సాకర్ ప్రపంచకప్‌లో ఈజి ప్ట్ సంచలనం సృష్టించింది. తమ చరిత్రలోనే తొలిసారి వరల్డ్‌కప్‌లో విజయాన్ని రుచి చూ సింది. గ్రూప్ జిలో భాగంగా జరిగిన మ్యాచ్ లో 3 గోల్స్ తేడాతో న్యూజిలాండ్‌ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ తొలి గోల్ చేయగా... సెకండాఫ్‌లో ఈజిప్ట్ అదరగొట్టింది.

ఏకంగా మూడు గోల్స్ కొట్టి తిరుగులేని విజయాన్ని అందుకుంది. 58న నిమిషంలో ఈజిప్ట్ ప్లేయర్ జీకో ఫ్రీ హెడర్ గోల్ చేయగా... తర్వాత 9 నిమిషాలకే సలా హ్ మరో గోల్ సాధించాడు. ఈ ఆధిక్యాన్ని చివరి వరకూ కాపాడుకున్న ఈజిప్ట్ 82వ నిమిషంలో ట్రెజెగెట్ మూడో గోల్ కొట్టి విజయాన్ని ఖరారు చేశాడు. దీంతో 92 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈజిప్ట్ గెలిచింది.