పీఆర్సీ,డీఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలి
డీటీఎఫ్ జిల్లా కార్యదర్శి నీలం సంపత్ కుమార్
ధర్మపురి,మార్చి25(విజయక్రాంతి): ఎండపల్లి మండల కేంద్రంలో డెమోక్రటిక్ టీచర్స్ ఫేడరేషన్ ఎన్నికల పరిశీలకులు రవీందర్ రెడ్డి, ఎన్నికల అధికారి నీలం సంపత్ కుమార్ ఆధ్వర్యంలో డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ వెల్గటూర్ మరియు ఎండపల్లి మండలాల నూతన కార్యవర్గ ఎన్నికలు బుధవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఢీటిఎఫ్ జిల్లా కార్యదర్శి నీలం సంపత్ మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పట్ల పోరాడటమే కాకుండా సామాజిక బాధ్యతతో పనిచేసే సంఘం ఢీటిఎఫ్ అని పేర్కొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు అమలు చేయాల్సిన పీఆర్సీ, డిఏ బకాయిలు వెంటనే విడుదల చేయాలని, ప్రభుత్వ పాఠశాలలకు అధిక నిధులు కేటాయిస్తూ మౌలిక వసతులు ఏర్పాటు చేస్తూ విద్యారంగానికి కృషి చేయాలని, రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన బకాయలను విడుదల చేయకపోవడం చాలా బాధాకరమని ప్రభుత్వం యొక్క పాలనలో ఉద్యోగులదే క్రియాశీలక పాత్ర అనీ, వారిని చిన్నచూపు చూడడం బాధాకరమని పేర్కొన్నారు.
అనంతరం వెల్గటూర్ మరియు ఎండపల్లి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు.వెల్గటూర్ మండల అధ్యక్షులుగా సాగర్, ప్రధాన కార్యదర్శిగా సిహెచ్ మహేష్ మరియు ఉపాధ్యక్షులుగా గంగన్న, రమాదేవి, గంగరాజు, కార్యదర్శులుగా సతీష్, శ్రీనివాస్, రమేష్, ఆడిట్ కమిటీ కన్వీనర్ గా వెంకటేశ్వర్లు కార్యవర్గ సభ్యులుగా ఉషా కిరణ్, ప్రవళిక, అనిత జిల్లా కౌన్సిల్ సభ్యులుగా మల్లయ్య, సత్తయ్య , సురేంద్ర స్వామి, సంపత్ ఎన్నికయ్యారు.




