3 July, 2026 | 11:10 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

ప్రజావాణి దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి

21-04-2026 12:00 AM

కలెక్టర్ మనుచౌదరి

 మేడ్చల్, ఏప్రిల్ 20 (విజయ క్రాంతి): ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత శాఖల అధికారులు పరిశీలించి వెంటనే పరిష్కరించాలని కలెక్టరు మను చౌదరి అధికారులను ఆదేశించారు. సోమవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి జిల్లా అదనపు కలెక్టర్  విజయేందర్ రెడ్డి తో కలిసి కలెక్టరు (103) దరఖాస్తులు స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టరు  మాట్లాడుతూ ఎంతో వ్యయ, ప్రయాసల కోర్చుకొని వారి సమస్యలను పరిష్కరిస్తామనే నమ్మకంతో ప్రజలు మన వద్దకు వస్తారని, వారి నమ్మకాన్ని నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నదని కలెక్టర్  తెలిపారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని దరఖాస్తుల పరిశీలనలో ఏలాంటి జాప్యం లేకుండా చూడాలని కలెక్టరు అన్నారు.

అదేవిధంగా తిరస్కరించే దరఖాస్తుల గురించి తిరస్కరణకు గల కారణాలను తప్పనిసరిగా వివరంగా అర్జీదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల  వివరాలను ఆన్ లైన్ లో వెంట వెంట నమోదు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టరు సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.