తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన ప్రగతి
ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభోత్సవం
రాజన్న సిరిసిల్ల,(విజయక్రాంతి): పురపాలక సంఘం స్థానిక మూడవ వార్డ్ విద్యానగర్-గీత నగర్ చౌరస్తా ప్రారంభించిన పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి , జిల్లా గ్రంధాలయ సంస్థ అధ్యక్షులు నాగుల సత్యనారాయణ గౌడ్ ముఖ్య అతిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం అధ్యక్షురాలు జిందం కళ చక్రపాణి మాట్లాడుతూ... దాదాపు గత సంవత్సర కాలంగా పాలకవర్గం లేకపోవడం కారణంగా సిరిసిల్లలో పారిశుధ్య నిర్వహణలో సమస్యలు ఏర్పడడంతో మా నూతన పాలకవర్గం మొదటి సాధారణ సమావేశంలోనే ప్రత్యేక సానిటేషన్ డ్రైవ్ నిర్వహించాలి.
ప్రత్యేకంగా నిధులు కేటాయించుకొని ప్రణాళికలు రూపొందించుకోవడం కూడ జరిగింది. ఇంతలోనే రాష్ట్ర ప్రభుత్వం కుడ ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక అనే కార్యక్రమాన్ని కూడ రూపొందించడం జరిగింది ఈ కార్యక్రమ యొక్క ముఖ్య ఉద్దేశం కూడ స్వచ్ఛత నియమాలను పాటిస్తూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం పురపాలక సంఘం యొక్క సేవలను పారదర్శకంగా ప్రజలకు అందించడం అలాగే ప్రభుత్వం నుండి అసలైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందిల చూడడం పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించడం కాబట్టి నేటి నుండి 99 రోజులపాటు అట్టే జూన్ 12వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతోందన్నారు.
మున్సిపల్ నుండి ఎన్ని స్వచ్ఛత కార్యక్రమాలు నిర్వహించిన ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించినప్పుడు మాత్రమే సిరిసిల్ల పూర్తి స్థాయిలో స్వచ్ఛ సిరిసిల్ల మారుతుందని అన్నారు .ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా తన ఇంటి నుండి వ్యాపార సముదాయాలు నుండి వెలువడే చెత్తను తడి పొడి హానికరమైన చెత్తలుగా వేరుచేసి చెత్త సేకరణ వాహనాల అందించాలని బయట ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితి లో చిత్తపడవేయ రాదని ఒకవేళ ఎవరైనా అలా చేసిన కచ్చితంగా వారిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ప్రతి ఒక్కరు తమ ఇంటిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటారు.
ఊరును కూడా అంతే శుభ్రంగా ఉంచుకునేలా కృషి చేయాలని మన ఊరినీ మన ఇంటి తో సమానంగా భావించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. అదేవిధంగా రోజు పారిశుధ్య నిర్వహణ కార్యక్రమాలలో కార్మికులు పడే ఇబ్బందులను గుర్తు చేస్తూ ప్రతి ఒక్కరూ వారి పట్ల సానుభూతిని కలిగి ఉండాలని వారిని గౌరవించాలన్నారు. అదేవిధంగా ప్రజలతో మున్సిపల్ పాలకవర్గ సభ్యులతో ప్రజా ప్రతినిధులతో అధికారులతో కలిసి సిరిసిల్లను పరిశుభ్రంగా ఉంచుతామని స్వచ్ఛత నియమాలను పాటిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఖాదిర్ పాషా , వైస్ చైర్మన్ దార్ల సందీప్, కౌన్సిలర్ సభ్యులు, మార్కెట్ కమిటీ చైర్మన్ మున్సిపల్ అధికారులు ప్రజలు పాల్గొన్నారు.




