ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలి
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని మండల సమైక్య కార్యాలయంలో సోమవారం జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ అడిషనల్ డి.ఆర్.డి.ఓ విజయలక్ష్మి వివోఏలతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.సమావేశంలో శ్రీనిధి రికవరీలో నాగిరెడ్డిపేట్ మండలం వెనుకబడి ఉందన్నారు. ఈ 15 రోజుల్లో ప్రత్యేక కార్యచరణ తయారు చేసుకోని రికవరీ శాతాన్ని పెంచేలా అందరూ సిబ్బంది కష్టపడి పని చేయాలని తెలుపడం జరిగింది. ముఖ్యంగా 10 గ్రామాలలో శ్రీనిధి ఎన్.పి.ఏ చాలా ఎక్కువగా ఉందన్నారు.
అక్కడ సిబ్బంది అందరూ ప్రత్యేక టీములుగా ఏర్పాటు చేసుకొని రికవరీ చేయాలని ఆదేశించారు.మళ్లీ వచ్చే నెల 18 వరకు ప్రోగ్రెస్ అన్ని అంశాలలో ఉండాలి.ప్రోగ్రెస్ లేని సిబ్బంది పైన చర్యలు ఉంటాయన్నారు.ప్రతి గ్రామ సంఘంలో మూడు రకాల సంఘాలు చేయాలని తెలిపారు.వృద్ధుల సంఘాలు, వికలాంగుల సంఘాలు, కిషోర్ బాలికల సంఘాలు చేయాలని డిపిఎం శ్రీనివాస్ తెలపడం జరిగింది.కామారెడ్డి జిల్లాలో 715 గ్రామ సంఘాలు ఉన్నాయని చిన్న సంఘాలు 17 వేల,,16 ఉన్నాయని తెలిపారు.
జిల్లాలో శ్రీనిధి 89.93 కోట్లు లక్ష్యం కాగా, జూన్ టార్గెట్ 15,00 కోట్లు, అచీవ్మెంట్ 13.34 కోట్లు, శాతం 88.93%,డిమాండ్లు 35 కోట్ల 75 లక్షలు,రికవరీ 14 కోట్ల 81 లక్షలు,శాతం 41.40%, అయ్యాయాన్ని తెలిపారు.జిల్లావ్యాప్తంగా బ్యాంకు లీకేజ్ టార్గెట్ జూన్ వరకు 107 కోట్ల 80 లక్షలు, అచీవ్మెంట్ 114 కోట్లు 30 లక్షలు,శాతం 106.03%, రికవరీ 98.63% అయిందన్నారు. నాగిరెడ్డిపేట మండలంలో చూస్తే శ్రీనిధి టార్గెట్ ఒక కోటి 84 లక్షలు కాగా, అచీవ్మెంట్ 18 లక్షలు, శాతం 10%, డిమాండ్లు ఒక కోటి నలభై లక్షలు,రికవరీ 10 లక్షలు ఇంకా రికవరీ చేయవలసినవి ఒక కోటి 25 లక్షలు ఉన్నాయని, శాతం 12.11%, బ్యాంకు లీకేజీలో మూడు కోట్ల 91 లక్షలు, అచీవ్మెంట్ రెండు కోట్ల నలభై లక్షలు, శాతం 61.39%, రికవరీ శాతం 98.82% ఉన్నాయని డిఆర్డిఓ విజయలక్ష్మి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు బెస్త శాంతమ్మ, డిపిఎం.ఐబి శ్రీనివాస్, బ్యాంకు డిపిఎం రాజయ్య, ఇన్చార్జి ఏపిఎం దత్తు, సీసీలు, వివోఏలు పాల్గొన్నారు.






