ప్రభాకర్‌రావుకు మరో షాక్
19-12-2025 11:35 AM
ప్రభాకర్ రావు కస్టడీ పొడిగింపు
హైదరాబాద్: అనధికార ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone tapping case) ప్రధాన నిందితుడు, మాజీ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (Special Investigation Team) చీఫ్ టి. ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు షాకిచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు కస్టడీ పొడిగించారు. సిట్ దర్యాప్తు కోసం ప్రభాకర్ రావు కస్టడీని సుప్రీంకోర్టు పొడిగించింది. ఈనెల 25 వరకు ప్రభాకర్ రావు కస్టడీ పొడిగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇంటి నుంచి ఆహారం, అవసరమైన మందులు తీసుకునేందుకు ప్రభాకర్ రావుకు అనుమతించింది. విచారణను జనవరి 16కు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.






