8 July, 2026 | 1:41 AM

స్పెయిన్ చేతిలో పోర్చుగల్ నాకౌట్

08-07-2026 12:44 AM

డల్లాస్, జూలై 7: సాకర్ ప్రపంచకప్‌లో పోర్చుగల్ పోరాటం ముగిసింది. ప్రీ క్వార్టర్ ఫైనల్లో స్పెయిన్ 1 స్కోరుతో పోర్చుగల్‌ను ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోటీ నడిచింది. నిర్ణీత సమయం ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి.

ఫస్టాఫ్‌లో స్పెయిన్ ఎక్కువసేపు బాల్‌ను తన ఆధీనంలోనే ఉంచుకున్నా గోల్ కొట్టలేకపోయింది. సెకండాఫ్‌లోనూ గోల్ రాకపోగా 91వ నిమిషంలో అద్భుతం జరిగింది. స్పెయిన్ సబ్‌స్టిట్యూట్ ప్లేయర్ మెరినో చేసిన సంచలన గోల్ ఆ జట్టును క్వార్టర్ ఫైనల్‌కు చేర్చింది. ఈ ఓటమితో పోర్చుగల్ ప్రస్థానం ప్రీ క్వార్టర్స్‌లోనే ముగిసినట్టయింది. ఓటమి అనంతరం పోర్చుగల్ ప్లేయర్స్ కన్నీటి పర్యంతమయ్యారు.