26 August, 2026 | 1:02 PM

స్టెల్లాలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు

26-08-2026 11:53 AM

బూర్గంపాడు,(విజయక్రాంతి):  మండలంలోని మొరంపల్లి బంజర్ గ్రామంలోని స్టెల్లా మారిస్ పాఠశాలలో గ్రాండ్ పేరెంట్స్ డే వేడుకలు మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక సర్పంచ్ బొర్రా సుభద్ర పాల్గొన్నారు. విద్యార్థులు సర్పంచ్ కు  సెల్యూట్ చేసి తమ గౌరవాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుభద్ర మాట్లాడుతూ.. తల్లిదండ్రులు, పెద్దలను గౌరవించడం, వారి అనుభవాలను ఆదర్శంగా తీసుకోవడం వంటి విలువలను విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్టెల్లా మేరీస్ ప్రిన్సిపాల్ సుమలత, సిస్టర్స్ రొసి, మేరీ మెర్సి సిస్టర్, టీచర్స్, తదితరులు పాల్గొన్నారు .