1 July, 2026 | 10:16 PM

Breaking News

ప్రజల పన్నులతో నిర్మించిన 'మహాప్రస్థానం'పై..   •   లయన్స్ క్లబ్ బాన్సువాడ నూతన అధ్యక్షుడిగా పాత బాలకృష్ణ   •   ఓదెల మల్లన్న ఆలయంలో భక్తులపై తేనెటీగల దాడి   •   రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలలోని ఆలయాలకు ఉత్సవాలు నిర్వహిస్తాం   •   ఘనంగా ఎల్‌హెచ్‌పీఎస్ ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొన్న గిరిజన నాయకులు   •   విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలి   •   ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలు   •   సందీప్ నగర్ కాలనీ సమస్యలపై కమిషనర్ స్పందన   •   పేద కుటుంబాల కాంగ్రెస్ ప్రభుత్వం అండగా నిలుస్తోంది   •   ఒక్కరి ఓటు హక్కు కూడా మిస్ కావొద్దు: ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు   •  

మంత్రి లక్ష్మణ్ కు పొన్నం బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే

08-10-2025 07:26 PM

ఎమ్మార్పీఎస్ నాయకులు..

హుజూరాబాద్ (విజయక్రాంతి): మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. పొన్నంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సహచర మంత్రిని అసభ్యపదజాలంతో దూషించడం సరైన పద్దతికాదని అన్నారు. మంత్రి పొన్నం మాదిగల ఓట్లతో గెలిచారని గుర్తు చేశారు. క్షమాపణ చెప్పకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తునికి వసంత్, వెంకటస్వామి, రుద్రారపు రాంచంద్రం, మారెపల్లి శ్రీనివాస్, దేవునూరి రవీందర్, అంబాల రాజు తదితరులు  పాల్గొన్నారు.