calender_icon.png 11 February, 2026 | 10:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముగిసిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

11-02-2026 05:18:03 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటలోపు క్యూలైన్లలో ఉన్నవారికి ఓటు వేసేందుకు రాష్ట్ర ఎన్నికల అధికారులు అవకాశం కాల్పించారు. చెదురుముదురు ఘటనలు మినహా పోలింగ్ మాత్రం ప్రశాంతంగా జరిగిందన్నారు. మొత్తం 116 మున్సిపాల్టీలు, 7 కార్పోరేషన్లకు ఇవాళ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్ లో విజేతలను ప్రకటించేందుకు శుక్రవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ఎల్లుండి 136 కేంద్రాల్లో మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని, ఈనెల 16వ తేదిన మున్సిపల్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక ఉంటుందని ఎన్నికల అధికారులు తెలిపారు.