calender_icon.png 5 February, 2026 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గద్వాలలో రాజకీయ వ్యభిచారం నడుస్తోంది

05-02-2026 12:06:19 AM

  1. సొంత పార్టీ నేతలపై సరిత సంచలన వ్యాఖ్యలు!

కాంగ్రెస్ పార్టీ లైన్కే నా కట్టుబాటు.. పార్టీ వీడే ప్రసక్తే లేదు

రాహుల్ గాంధీని, సంపత్ కుమార్‌ను అవమానించిన శక్తులపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తా

ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో ఆయనకే తెలియదు: మాజీ జెడ్పీ చైర్పర్సన్ సరితా తిరుపతయ్య ఫైర్

గద్వాల ఫిబ్రవరి 4: గద్వాలలో రాజకీయ వ్యభిచారం నడుస్తోందని, మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేసిన వారిని కాదని ఇతర పార్టీలో నుంచి వచ్చిన వారికి డీసీసీ అధ్యక్షుడు ప్రాధాన్యత ఇస్తున్నారని కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచా ర్జి సరిత తిరుపతయ్య ఆరోపించారు. బుధవారం గద్వాలలోని మాజీ జెడ్పీ సరిత తి రుపతయ్య నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాజీ జెడ్పీ చైర్ పర్సన్ సరిత మాట్లాడుతూ...

గద్వాల ము న్సిపల్ ఎన్నికల్లో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీకి కష్టపడిన వారికి కాదని కొత్త వారికి బీఫాంలు ఇవ్వడం పై ఆమె నిప్పులు చెలరేగారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పక్షాన ఉం డే పార్టీ అని, ఒక నిబద్ధత ఉన్న పార్టీ, ఒక సిస్టమ్ మీద నడిచే పార్టీ అని, అధిష్టానాన్ని కాదని డీసీసీ రాజీవ్ రెడ్డి ఏదో డె మోక్రటిక్ వరల్ లో ఉన్నట్టు వ్యవహరిస్తు మోనోపొలిజం చేస్తే ఇది కరెక్ట్ కాదు అని ఆ మె అన్నారు.

తాను కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని, సీఎం రేవంత్ రెడ్డి నాయ కత్వంపై తమకు నమ్మకం ఉందని స్పష్టం చేశారు. అలాగే, తనను పార్టీలోకి ఆహ్వానించిన ఎంపీ మల్లు రవి కి రుణపడి ఉంటా నన్నారు. కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇవ్వాల తీవ్ర అన్యాయం జరిగిందని ఆమె అన్నారు. గద్వాలలో అర్హులు న్న వారికి టికెట్లు ఇవ్వలేదన్నారు. ఇప్పటికే టికెట్ లు రాని వారు ఇతర పార్టీలోకి వెళ్లారని, మరికొందరికి టికెట్లు ఇస్తామని చెప్పి ఇవ్వకపోవడంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు దాఖలు చేశారని పేర్కొన్నారు.

స్వతంత్ర అభ్యర్థుల కోసం తాను పోరాడుతానని, కచ్చితంగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉంటున్నా, కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతు న్నా అని ఆమె స్పష్టం చేశారు. నేను పార్టీలో కొనసాగుతూ, పార్టీ కోసం కష్టపడ్డ వాళ్ళ కోసం నేను నిలబడతా దీనిలో ఎలాంటి అ పోహలు లేవన్నారు. రాష్ట్రమంతా ఒక తీరు గా ఉంటే, గద్వాలలో మాత్రం విచిత్రమైన రాజకీయా పరిస్థితులు నెలకొన్నాయని ఆమె మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో పాటు రాష్ట్ర నేతలు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు దామోదర్ రాజనర్సింహ, వాకిటి శ్రీహరి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్లను సైతం ఈ ప్రాంత నేతలు అవమానించారని ఆమె ఆ రోపించారు. బహుజన బిడ్డను అనగదొక్కడానికి కుట్రలు పన్నుతున్న కుయుక్త శక్తుల పై త్వరలోనే రాష్ట్ర అధిష్టానానికి ఫిర్యాదు చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.

గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తీరుపై సరిత ఘాటు విమర్శలు చేశారు. ‘ఒక్కోసారి ఒక్కో మాట మార్చే ఎమ్మెల్యే ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో కూడా తెలియని పరిస్థితి నెలకొందని‘ ఎద్దేవా చేశారు. కష్టకాలంలో కాంగ్రెస్ పార్టీని ఎవరు కాపాడారో రాష్ట్ర నాయకత్వానికి తెలుసని, త్వరలోనే అసలు నిజాలు బయటకు వస్తాయని ఆమె పేర్కొన్నారు.

తాను మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ లైన్కు కట్టుబడి పని చేస్తున్నానని, పార్టీపై తనకు పూర్తి నమ్మకం ఉందని సరిత స్పష్టం చేశారు. ‘నేను కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు. నాపై నమ్మకం ఉంచిన అభ్యర్థులను ఖచ్చితంగా గెలిపించుకుంటాను‘ అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నాపై కుట్రలు చేసే వారికి కాలమే సమాధానం చెబుతుందని ఆమె హెచ్చరించారు.