27 August, 2026 | 8:18 AM

రాజకీయ ఖైదీలను విడుదల చేయాలి

27-08-2026 01:14 AM

హనుమకొండ టౌన్, ఆగస్టు 26 (విజయక్రాంతి): స్వప్రయోజనం కోసం కాకుండా సామాజిక ప్రయోజనం కోసం బాధ్యతగా వ్యవహరించిన వారందరూ కూడా రాజకీయ ఖైదీలుగానే గుర్తించాలని, అనేక సంఘటనలకు కారకులుగా చేస్తూ జైళ్లలో నిర్బంధించిన రాజకీయ ఖైదీలను ప్రభుత్వం బేషరతుగా విడుదల చేయాలని రాజకీయ ఖైదీల విడుదల ఐక్యవేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు.

హనుమకొండలో నిర్వహించిన సమావేశంలో ఆ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రభుత్వాలు ప్రజాస్వామిక విలువలకు విధానాలను అవలంబిస్తూ రాజ్యాంగం కల్పించిన సంక్షేమ విధానాలను విస్మరిస్తూ, కొనసాగిన పాలనకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు ఉద్భవించాయని, ఈ క్రమంలో మన దేశంలో ఐదు, ఆరు దశాబ్దాలుగా ప్రజల జీవించే హక్కు, జీవనోపాధి హక్కుల కోసం బలమైన పోరాటాలకు ప్రధానంగా ఆదివాసులు, అణగారిన వర్గాలు, పేదలు ఉన్న మైదాన ప్రాంతాలు కేంద్రంగా మారాయన్నారు.

ఉద్యమపార్టీలే లేని సందర్భంలో గతంలో నమోదు చేసిన ఉపా కేసుల్ని కూడా అన్యాయమైనవి, అక్రమమైనవని ఈ నేపథ్యంలో నమోదైన ఉపా కేసుల్ని ఉద్యమకారులపై, ఉద్యమ సానుభూతిపరులపై, ప్రజా సంఘాలపై, మేధావులపై, ప్రజా సంఘాల నాయకులపై పోరాడుతున్న ప్రజలపై ఉన్నాయని,ఇవన్నీ కూడా ప్రభుత్వం బేషరతుగా ఎత్తివేసి వారందరినీ విడుదల చేయాల్సిన ప్రజాస్వామిక కర్తవ్యం ప్రభుత్వాలపై ఉందన్నారు.