10 May, 2026 | 11:35 PM

Breaking News

సింగిరెడ్డిపల్లి యువకుని దారుణ హత్య   •   అక్రమ పశువుల రవాణాపైన సరిహద్దు చెక్ పోస్టులో పటిష్ట నిఘా   •   మోడీ సభకు తరలి వెళ్లిన నాగిరెడ్డిపేట బిజెపి నాయకులు   •   మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేంద్ర సహాయ మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం   •   125 వారాలు పూర్తి అయిన హనుమాన్ చాలీసా పారాయణం   •   బండి భగీరథను వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేయాలి   •   మద్నూర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునికి నాయకుల ఘన సన్మానం   •   కామారెడ్డి రక్తదాతల సమూహం, ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ కు అవార్డుల పంట   •   అమ్మవారి ఆలయంలో కమిషనర్ పూజలు   •   కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులుగా ఎన్నికైన బజ్జూరి వెంకటరెడ్డి   •  

రోడ్డుపై కత్తితో హల్చల్ చంపేసిన పోలీసులు

30-08-2025 12:40 AM

వీడియో పుటేజీతో తేటతెల్లం

లాస్‌ఏంజెల్స్, ఆగస్టు 29: భారత్‌కు చెందిన ఓ సిక్కు వ్యక్తి లాస్ ఏంజెల్స్ నగర రోడ్లపై కత్తితో హల్చల్ చేస్తుండగా పోలీసులు షూట్ చేశారు. సదరు సిక్కు వ్యక్తి నడి రోడ్డుపై గట్కా (కత్తితో చేసే సిక్కుల పురాతన యుద్ధ కళ) చేస్తుండగా పోలీసులు హతమార్చారు. జూలైలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీని పోలీసులు తాజాగా విడుదల చేశారు.

సదరు వ్యక్తి రోడ్డు మీద కత్తితో హల్చల్ చేస్తుండగా.. హుటాహుటిన అక్కడకు చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని కాల్చి చంపడం వీడియో స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి పేరు గురుప్రీత్ సింగ్ (35) అని లాస్‌ఏంజెల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్ తెలిపింది. గట్కా అనేది సిక్కుల సాంప్రదాయ యుద్ధ కళ.. వివిధ రకాల ఆయుధాల సాయంతో గట్కా ప్రదర్శిస్తారు.