యువతి అదృశ్యం.. కేసు నమోదు
25-05-2026 12:30 PM
ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం ఇవ్వాలని విజ్ఞప్తి
కోనరావుపేట మే 25,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామానికి చెందిన భవాని భర్త బొజ్జ అనిల్ (25), ముదిరాజ్ కులానికి చెందిన యువతి ఈ నెల 23-05-2026 తేదీ ఉదయం 6 గంటల నుంచి ఇంటి నుండి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఈ ఘటనపై భవాని తండ్రి లాలా హనుమంతు సోమవారం కోనరావుపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. తన కుమార్తె ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని దరఖాస్తులో పేర్కొన్నారు. ఫిర్యాదు స్వీకరించిన ఎస్‌ఐ ప్రశాంత్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.ఈమె ఆచూకీ ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే కోనరావుపేట పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు కోరారు.






