రైతులకు జీలుగు విత్తనాల పంపిణీ
25-05-2026 12:18 PM
ప్యాక్స్ చైర్మన్ రామ్మోహన్ రావు చేతుల మీదుగా పంపిణీ
కోనరావుపేట,(విజయక్రాంతి): కోనరావుపేట మండలం కొలనూర్ ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో సోమవారం రైతులకు జీలుగు విత్తనాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ సంకినేని రామ్మోహన్ రావు రైతులకు విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొలనూర్ సొసైటీలో 300 జీలుగు బస్తాలు అందుబాటులో ఉన్నాయని, రైతులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రసాయన పెస్టిసైడ్ల వినియోగాన్ని తగ్గించి జీలుగు, జింకు వంటి పచ్చిరొట్టెల వినియోగాన్ని పెంచాలని రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జలగం అరవింద్ రావు, ఉపసర్పంచ్ బాబు, కొలనూర్ క్లస్టర్ ఏఈఓ హేమాజీ, సీఈఓ గాజుల రాజేశం, డైరెక్టర్లు, రైతులు తదితరులు పాల్గొన్నారు.






