25 May, 2026 | 12:30 PM

Enforcement Directorate: ఈడీ విచారణకు హాజరైన ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్

25-05-2026 11:32 AM

హైదరాబాద్: భూధాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్(IAS Officer Amoy Kumar ) సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. గతంలో మహేశ్వరం పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసు ఆధారంగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(Enforcement Directorate) దర్యాప్తు చేస్తోంది. భూదాన్ భూముల(Bhoodan Lands) వ్యవహారంలో మనీలాండరింగ్ కోణంలో ఈడీ విచారణ చేస్తోంది. గతంలోనూ అమోయ్ కుమార్ ను ఈడీ అధికారులు విచారించారు. 42 ఎకరాలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టినట్లు అమోయ్ కుమార్ పై ఆరోపణలున్నాయి. ఈ సారి సేల్ డీడ్ వివరాలతో రావాలని అమోయ్ కుమార్ కు ఈడీ నోటీసులు ఇచ్చింది.