14 June, 2026 | 5:40 PM

ఆలయ నిర్మాణకు విరాళం అందజేత

14-06-2026 04:28 PM

నంగునూరు,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని అభయాంజనేయ స్వామి ఆలయ పునః ప్రతిష్ఠా మహోత్సవాలకు ఉపాధ్యాయుడు గోటూరి శ్రీనివాస రెడ్డి రూ.15 వేల విరాళం అందించారు. ఆదివారం ఆయన ఈ నగదును ఆలయ కమిటీ అధ్యక్షుడు మెతుకు హనుమంత రెడ్డికి అందజేశారు. దాతల సహకారంతో పునర్నిర్మించిన ఈ ఆలయంలో ఈ నెలలోనే వేద పండితుల ఆధ్వర్యంలో పునః ప్రతిష్ఠా మహోత్సవాలు నిర్వహించనున్నారు. విరాళం అందించిన శ్రీనివాస రెడ్డికి ఆలయ కమిటీ ధన్యవాదాలు తెలిపింది.