మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ప్లేస్మెంట్ డ్రైవ్
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుధాకర్
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని గుండ్లపోచంపల్లి మైసమ్మగూడ లో గల మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో విజయవంతంగా ప్లేస్ మెంట్ డ్రైవ్ కొనసాగిందని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుధాకర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... శనివారం మల్లారెడ్డి కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ప్రముఖ ఔషధ తయారీ సంస్థ కోవాలేంట్ లేబరేటరీ ఆధ్వర్యంలో ప్లేస్ మెంట్ డ్రైవ్ నిర్వహించడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి కోవాలంటే ల్యాబరేటరీ కు చెందిన హెచ్ఆర్ మేనేజర్ అరుణ్ కుమార్, అసిస్టెంట్ హెచ్ఆర్ మహేష్ లు నేతృత్వం వహించినట్లు ఆయన వెల్లడించారు.
ఈ కార్యక్రమానికి లైఫ్ సైన్సెస్ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ తరఫున తెలంగాణ ప్రాజెక్టు కోఆర్డినేటర్ కుమార స్వామి.కమ్యూనిటీ ఫార్మా మొబిలైజర్ సంపత్ విజయరాజు ఓవ్క్ మద్దతు అందించారు. కళాశాల మల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో ప్లేస్ మెంట్ డ్రైవ్ లో 150 మందికి పైగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారని ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం సుధాకర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్ శ్రీధర్. ప్లేస్ మెంట్ కోఆర్డినేటర్ లు డాక్టర్ వల్లి కుమారి. ఎస్ శ్రీదేవి లతో పాటు అధ్యాపక వర్గం సమిష్టి సహకారంతో కార్యక్రమం విజయవంతంగా కొనసాగిందని ఆయన చెప్పారు.




