19 May, 2026 | 7:51 PM

Breaking News

ఖానాపూర్ మండలంలో పైలట్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు   •   23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టకు రాక   •   సిసీలుగా గుర్తించి పదోన్నతులు కల్పించాలి   •   మహిళా సంఘాల నిధులపై శిక్షణ   •   సీఎం రిలీఫ్ చెక్కులు అందజేసిన మార్కెట్ కమిటీ చైర్మన్ తాడెం వెంగల్ రావు   •   మొక్కజొన్న బస్తాల దిగుమతి వేగవంతం చేయాలి   •   వృద్ధుడి అదృశ్యం   •   సీఎం నివాస ముట్టడి పిలుపు నేపథ్యంలో మోహన్ నాయక్ అరెస్ట్   •   శిధిలావస్థకు చేరుకున్న గట్టు చెరువును పరిశీలించిన ఎమ్మెల్యే డా.పాల్వాయి హరీష్ బాబు   •   ఇందిరమ్మ కమిటీని రద్దు చేసి పూర్తి బాధ్యతలు సర్పంచులకు ఇవ్వగలరు   •  

ఫోన్ ట్యాపింగ్‌పై మరో బాంబ్ పేల్చిన మంత్రి పొంగులేటి

10-02-2026 04:08 PM

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్‌పై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ఇంకా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారనే అనుమానం ఉందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ పరికరాలు కొందరి దగ్గర ఉన్నట్లు నిర్ధారణ అయిందని, ఈ అంశాన్ని ప్రభుత్వం సీరియస్ గా తీసుకుందని పొంగులేటి తెలిపారు. ఫామ్‌హౌస్‌లు, మామిడి తోటల్లో ఎక్కడేం పెట్టారో విచారణ జరుపుతామన్నారు. దొంగతనంగా ఫోన్ లు వింటున్నవారిపై చట్టరిత్యా చర్యలు తప్పవని, నేను మాట్లాడిన మాటలు ఎలా విన్నారో విచారణ చేస్తామని మంత్రి పొంగులేటి వెల్లడించారు.