28 March, 2026 | 4:28 PM

Breaking News

సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •   'తొలి ముద్ద'.. బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం.. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం   •   కిషన్ రావుపేటలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన   •   కూసుమంచి తహాశీల్దారుగా సైదులు బాధ్యతలు స్వీకరణ   •   ఘనంగా రావి వీరవేన్లయ్య 34 వర్ధంతి   •  

అంబేద్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు

26-03-2026 01:46 AM

మహబూబాబాద్, మార్చి 25 (విజయక్రాంతి): ఉద్యోగ భద్రత కల్పించడంతో పాటు నెలకు 18 వేల రూపాయల వేతనం చెల్లించాలని, ఇతర సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ కొద్దిరోజులుగా ఆశా కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలో భాగంగా బుధవారం జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లో రాస్తారోకో నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రాలు అందజేశారు.

కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు తమ సమస్యలకు పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చి, అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు గడుస్తున్నా తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించడంలో చిత్తశుద్ధి చూపడం లేదని ఆరోపించారు. తమ సమస్యలకు పరిష్కారం లభించేంతవరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరిం చారు. పలు మండలాల్లో ఆశా కార్యకర్తల రాస్తారోకో కారణంగా కొంతసేపు వాహనాల రాకపోకులకు అంతరాయం కలిగింది.