25 June, 2026 | 1:47 PM

Breaking News

ఓటరు జాబితా సవరణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సీసీరోడ్డు పనుల్లో నాణ్యతా ప్రమాణాల లోపం   •   మంగనూర్ వాసి దారుణ హత్య   •   నిజాంసాగర్ పోలీసుల ఆధ్వర్యంలో ముమ్మర వాహన తనిఖీలు   •   SIR ప్రక్రియను సమర్థవంతంగా పూర్తి చేయాలి: జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్   •   గట్ల గౌరవరం గ్రామంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్   •   నాగర్‌ కర్నూల్ నూతన ఎక్సైజ్ సూపరింటెండెంట్‌గా వేణుగోపాల్ రెడ్డి   •   తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభం   •   డిజిటల్ అరెస్ట్ ముఠాలపై ఉక్కుపాదం.. 16 రాష్ట్రాల్లో సీబీఐ సోదాలు   •   కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌తో ముగ్గురు సీఎంల భేటీ   •  

కార్మిక సమస్యలపై ఎన్ని వినతిపత్రాలు ఇచ్చినా యాజమాన్యానికి కనికరం లేదు

28-04-2026 08:49 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): కార్మిక సమస్యలపై ఐటీసీ యాజమాన్యానికి పలు మార్లు వినతిపత్రాలు ఇచ్చినా కనికరం లేదని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ కన్వీనర్ పాటి సోమిరెడ్డి, కో-కన్వీనర్లు సానికొమ్ము రామచంద్రారెడ్డి, ఎండీ.యాకూబ్ పాషా, బల్లెం నాగయ్యలు మండిపడ్డారు. మంగళవారం 34వ రోజుకు రిలేనిరాహారదీక్షలు చేరుకోవడంతో దీక్షలకు బీఆర్టీయూ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కుందూరు పెద్దిరెడ్డి, ఐఎన్టీయూసీ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వుర్లుగొండ వీరన్నలు కార్మికులకు మద్దతు పలికారు.

ఈ సందర్భంగా జేఏసీ బాధ్యులు మాట్లాడుతూ కార్మికులు తమ సమస్యలపై ఎండను సైతం లెక్కచేయకుండా నెలరోజులకు పైగా దీక్షలు చేస్తున్నా నిమ్మకు నీరెత్తినట్లు యాజమాన్యం వ్యవహరిస్తుందని...కార్మిక సమస్యలపై జేఏసీ పలుమార్లు వినతిపత్రాలు అందజేసినా పట్టించుకోకుండా కాలయాపన చేస్తుందని, మున్ముందు కార్మికుల ఆగ్రహానికి యాజమాన్యం గురికాకతప్పదని హెచ్చరించారు. రాబోయే రోజుల్లో పోరాటం ఉధృతం కానుందని హెచ్చరించారు. దీక్షలో జేఏసీ నాయకులు చుక్కపల్లి బాలాజీ, సూరిశెట్టి జగదీష్, కందాల వెంకటరెడ్డి, కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.