2 March, 2026 | 3:11 PM

ఫార్మా కంపెనీల అనుమతుల రద్దు కోరుతూ ప్రజావాణిలో వినతి

02-03-2026 01:40 PM

భిక్కనూర్, (విజయక్రాంతి): భిక్కనూర్ మండల పరిధిలో నూతనంగా మంజూరైన ఫార్మా కంపెనీల(pharma companies) అనుమతులను వెంటనే రద్దు చేయాలని పెద్దమల్లారెడ్డి గ్రామ సర్పంచ్ కోడూరి సాయగౌడ్, ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి, వార్డు సభ్యులు డిమాండ్ చేశారు. సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్‌కు తీర్మానాలు అందజేశారు. ఫార్మా కంపెనీల వల్ల పర్యావరణానికి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర ముప్పు ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.