25 August, 2026 | 10:31 PM

చేగుర్తిలో ఘనంగా వన మహోత్సవం

25-08-2026 09:26 PM

కొత్తపల్లి,(విజయక్రాంతి): కరీంనగర్ రూరల్ మండలం చేగుర్తి గ్రామంలో మంగళవారం గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఎంపిడిఓ  అశోక్ కుమార్, గ్రామ సర్పంచ్ బాషవేని సరోజన మల్లేశం యాదవ్, ఉప సర్పంచ్ గాలిపెల్లి రవీందర్, కరీంనగర్ జిల్లా గొర్ల కాపరుల సంఘం అధ్యక్షులు బాషవేని మల్లేశం యాదవ్, ఏపీఓ శోభరణి, టెక్నికల్ ఏసి రమాదేవి ముఖ్య అతిధులు హాజరై మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో  గ్రామ కార్యదర్శి గోనె రాజ మల్లయ్య,  ఫీల్డ్ అసిస్టెంట్ గాలిపెల్లి సుజాత  వార్డు సభ్యులు, అంగన్వాడీ టీచర్, ఉపాధి హామీ సిబ్బంది, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.