18 April, 2026 | 9:04 PM

చలివేంద్రంను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

18-04-2026 07:38 PM

యువజన కాంగ్రెస్ నాయకులు దొనకొండ విష్ణువర్ధన్

తుంగతుర్తి,(విజయక్రాంతి): తుంగతుర్తి మండల కేంద్రంలో ప్రజల దాహార్తి తీర్చేందుకు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు దొనకొండ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ చలివేంద్రాన్ని మండలంలో వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని దొనకొండ విష్ణువర్ధన్ అన్నారు. ఎండ తీవ్రతతో ఇబ్బందులు పడుతున్న ప్రజల దాహార్తి తీర్చేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ప్రతి గ్రామములో యువత ముందుకు వచ్చి చలివేంద్ర ఏర్పాట్లకు శ్రీకారం చుట్టాలని కోరారు.