ప్రపంచ మహాసభలకు ప్రజాకవి సబ్బు నాగయ్యకు పిలుపు
15-05-2026 07:32 PM
కూసుమంచి,(విజయక్రాంతి): కూసుమంచి మండలం ఖమ్మం జిల్లా రాజుపేట గ్రామానికి చెందిన కవి రచయిత సబ్బు నాగయ్య 200 ప్రశంస పత్రాలు 5 జాతీయ అవార్డులు అందుకున్నడు. శ్రీశ్రీ కళావేదిక సాహిత్య సమస్త కార్యదర్శిగా సబ్బు నాగయ్య శ్రీశ్రీ కళావేదిక వ్యవస్థాపకులు కత్తి మండల ప్రతాప్ కుమార్ నిర్దేశాలతో స్వాతి సారస్వత పరిషత్ అధ్యక్షులు కిమ్స్ ఎండ్ గ్లోబల్ యూనివర్సిటీ అది నేత కేవి వి. సత్యనారాయణ సౌజన్యంతో జరుగుతున్న ఈ ప్రపంచ స్థాయి సదస్సుకు సబ్బు నాగయ్య ప్రజా కవి ఆహ్వానించారు. ఈ కార్యక్రమం విజయవాడలో యూనివర్సిటీలో నిర్వహిస్తున్నారు. ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు హాజరుకానున్నారు. ఈ మేరకు వచ్చే నెల 6, 7 తేదీలలో ఆయనకు ఘన సన్మానం చేయడం కూడా జరుగుతుంది.






