3 April, 2026 | 7:32 PM

పోరాట పార్టీ సిపిఐకి ప్రజలు చేయూతనివ్వండి

03-04-2026 05:29 PM

పల్లా వెంకట్ రెడ్డి సిపిఐ జాతీయ కార్యదర్శి

దేవరకొండ,(విజయక్రాంతి): పోరాట పార్టీ సిపిఐకి ప్రజలు చేయూతనివ్వాలని అని పల్లా వెంకట్ రెడ్డి సిపిఐ జాతీయ కార్యదర్శి అన్నారు. శుక్రవారం ఇంటింటికి సిపిఐ” కార్యక్రమంలో దేవరకొండ మండల కేంద్రంలో  సిపిఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ... భారత కమ్యూనిస్టు పార్టీ ఈ దేశంలో ఆవిర్భవించి 100 సంవత్సరాలు దాటిన నేపథ్యంలో మతోన్మాద, కార్పొరేట్ కబంధహస్తాల నుండి దేశాన్ని విముక్తి చేసి సమసమాజ స్థాపన కోసం నిరంతరం పోరాటాలు చేస్తున్న ఏకైక పార్టీ సిపిఐ అని తెలిపారు. కార్మికులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, యువజనులు తదితర ప్రజాసంఘాలను నిర్మించి, వెట్టి చాకిరి నిర్మూలనకు, కార్మికులు, కర్షకులను దోపిడి నుండి విముక్తి చేయడానికి సిపిఐ పోరాటాలు సాగించిందని పేర్కొన్నారు.

అమరవీరుల రక్త త్యాగాలతో ఎన్నో విజయాలు సాధించి, భారతదేశ రాజకీయ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న పార్టీ సిపిఐ అని తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పల్లా నరసింహ రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ... నిరంకుశ నిజాం పాలనను గద్దె దించడానికి జరిగిన మహత్తర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుమారు నాలుగున్నర వేల మంది ప్రాణత్యాగంతో 3000 గ్రామాలను విముక్తి చేసి, దాదాపు 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచిన ఘనమైన చరిత్ర సిపిఐదని గుర్తుచేశారు.

యుద్దం పేరుతో నిత్యవసర సరుకుల ధరలు పెంచటం అన్యాయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరి రావు,గిరిజన సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ అంజయ్య నాయక్, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే కాంతయ్య, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు తూము బుచ్చి రెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు డి సుదర్శన్ రెడ్డి, ఎస్ కనకాచారి,పి వెంకటయ్య, కే జయరాములు, వెంకటయ్య, ఎన్ రామస్వామి, వల్లమల్ల ఆంజనేయులు, శైలేష్, విజేందర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.