సాయి ప్రియా కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
రూ.9 కోట్ల డ్రైనేజీ పనులకు ఆమోదం
కాలనీ వాసుల సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు తోటకూర వజ్రెష్ యాదవ్
మేడిపల్లి,(విజయక్రాంతి): మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని సాయి ప్రియా కాలనీలో రూ. 9 కోట్లలతో డ్రైనేజీ పనులకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని గత పాలకుల నిర్లక్ష్యానికి గురైన ఈ కాలనీ అభివృద్ధి కోసం యుద్ద ప్రాతిపదికన నిధులు మంజూరు చేయించి పనులు ప్రారంభం చేసేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మేడ్చల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్ అన్నారు.
శుక్రవారం కాలనీ వాసులతో కలిసి కాలనీలో పర్యటించిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... అనేక సంవత్సరాలుగా సాయి ప్రియ కాలనీ అభివృద్ధికి నోచుకోలేదని పాలకుల వివక్షకు గురైందని దానిని కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి కాలనీలో కావాల్సిన రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ దీపాలు, మంచి నీటి కనెక్షన్ లాంటి మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ. 9 కోట్లు మంజూరు చేయించడం జరిగిందని పేర్కొన్నారు.




