3 April, 2026 | 8:51 PM

కారేపల్లిలో ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు

03-04-2026 07:03 PM

కారేపల్లి,(విజయక్రాంతి): సింగరేణి మండల కేంద్రంలో ని పెంట్రోల్ బంక్  సమీపంలో ఉన్న రోమన్ క్యాథలిక్  దేవాలయం లో శుక్రవారం ఫాదర్ రెవరెండ్‌   ప్రకాష్‌ ఆధ్వర్యంలో గుడ్‌ ఫ్రైడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ ప్రకాష్ ఏసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలకు సంబంధించి క్రైస్తవ సహౌదరి, సహౌదరులకు దైవ సందేశాన్ని వివరించారు.

గుడ్‌ ఫ్రైడే సంధర్బంగా కారేపల్లి  విచారణ పరిధిలోని విశ్వాసులు అందరూ కారేపల్లి ఆర్సీఎం చర్చి నుండి మొదలుకొని నిర్మల స్కూల్, అంబేద్కర్ సెంటర్, సినిమాల సెంటర్, బస్టాండ్ సెంటర్  నుండీ  దేవాలయం వరకు శిలువమార్గం చేస్తూ పాదయాత్రగా వెళ్లారు. అనంతరం వారితో కలిసి రోమన్ క్యాథలిక్ చర్చిలో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహించి ఏసుక్రీస్తు సిలువలో పలికిన ఏడు మాటలకు సంబంధించి క్రైస్తవ సహౌదరి, సహౌదరులకు దైవ సందేశాన్ని వివరించారు.