ఘనంగా బి.కిషోర్ చారి జన్మదిన వేడుకలు
03-04-2026 05:32 PM
శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
కుత్బుల్లాపూర్,(విజయక్రాంతి): తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని మోస్తూ, ప్రజల హక్కుల సాధన కోసం అహర్నిశలు శ్రమించిన బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు బి. కిషోర్ చారి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును మర్యాదపూర్వకంగా కలిసి, వారి చేతుల మీదుగా శాలువాతో సత్కారం పొందారు. అనంతరం సూర్యనగర్ కి చెందిన నాగేశ్వరరావు కి ముఖ్యమంత్రి సహాయనిధి కింద మంజూరైన ఎల్ఓసి లేఖను డివిజన్ నాయకులతో కలిసి ఎమ్మెల్యే కార్యాలయంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో 131 డివిజన్ అధ్యక్షుడు దేవరకొండ శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ సత్తిరెడ్డి, సీనియర్ నాయకుడు సోమేష్ యాదవ్, కాలనీవాసులు పాల్గొన్నారు.




