వడ్ల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన సర్పంచ్
03-04-2026 07:23 PM
భిక్కనూర్,(విజయక్రాంతి): భిక్కనూర్ మండలం పెద్దమల్లారెడ్డి గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ కోడూరి సాయగౌడ్ శుక్రవారం ప్రారంభించారు. రైతులు తమ పంటకు సరైన ధర పొందేందుకు ఈ కేంద్రం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఈఓ మోహన్ గౌడ్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. రైతులు దళారులను నమ్మకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాన్ని వినియోగించుకోవాలని సూచించారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో దొడ్డి కొమురయ్య జయంతిని ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు.




