ఇంటర్ లింక్ లైక్ ఏర్పాటు
03-04-2026 07:06 PM
లక్ష్మణ చందా,(విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలో విద్యుత్ సరఫరా అంతరాయం లేకుండా నాలుగు సబ్ స్టేషన్ లింక్ లైన్ పనులు చేపట్టినట్టు పట్టణ ఏడి కే శ్రీనివాసరావు తెలిపారు. శనివారం పట్టణంలోని ఆదర్శనగర్, 33/11 కివి మరమ్మతులతో పాటు లింక్ లైన్ పనులను చేపడుతున్నట్టు తెలిపారు. ఈ పనులు పూర్తయితే పట్టణంలో కరెంట్ సరఫరాలో అంతరం లేకుండా ఉంటుందన్నారు. ఈ పనుల కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని తెలిపారు. విద్యుని అధికారులు సహకరించాలని విద్యుత్ వినియోగదారులకు మెరుగైన విద్య సేవలు అందించేందుకు సంస్థ ఈ పనులు చేపట్టినట్టు తెలిపారు.




