9 May, 2026 | 10:40 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

గుప్తనిధుల కోసం తవ్వకాలు 8 మంది అరెస్ట్

29-11-2025 12:00 AM

ఘట్‌కేసర్, నవంబర్ 28 (విజయక్రాంతి) : గుప్తనిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న 8 మంది వ్యక్తులను పోచారం ఐటి కారిడార్ పోలీసులు అరెస్టు చేశారు. ఇన్ స్పెక్టర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం గురువారం (27.11.2025) రాత్రి   పోచారం ఇన్ఫోసిస్ కంపెనీ సమీపంలో సర్వేనెంబర్ 255, మారుతి వెంచర్ లో కొంతమంది వ్యక్తులు అక్రమంగా గుంతలు తవ్వుతూ, మట్టి తీయుతున్నారనే విశ్వసనీయ సమాచారం అందిందని, వెంటనే సంఘటన స్థలానికి చేరుకున్నట్లు తెలిపారు.

అక్కడకు వెళ్లి చూసే సరికి 8 మంది వ్యక్తులు ఆ ప్రదేశంలో అక్రమంగా మట్టిని తవ్వుతున్నట్లు కనిపించారు. వారిని విచారణ చేయగా తమ వివరాలు వెల్లడించారని 

గడిపల్లి మహేష్ (33) పురోహితుడు,

గోలుసుల అజయ్ (19) కూలీ,

మిరియాల ప్రశాంత్ (19) మెకానిక్,

అమ్మనమంచి హర్ష(24) పురోహితుడు,

బీనగోని శివ (21) విద్యార్థి,

ఊర్సు శివ (19) కూలీ,

బొక్క విష్ణు వర్ధన్ రెడ్డి (20) విద్యార్థి,

బీగుడం అరవింద్ (30) మెకానిక్ అని గుప్త నిధి కోసం అక్రమంగా మట్టిని తవ్వుతున్నామని అంగీకరించినట్లు తెలిపారు. తక్షణమే రెండు పంచులను ఏర్పాటు చేసి నిందితుల వద్ద నుండి ఎర్టిగా కారు, 8 మొబైల్స్, పూజా సామాగ్రి, సుజుకి బైక్, యాక్టివా వాహనం స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఈమెరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్ జరుపుకున్నట్లు పోలీసులు తెలిపారు.