మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్న ప్రజలు
- రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్‌కుమార్
- బీఆర్‌టీయూలో చేరిన పలువురు టీటీయూసీ నేతలు
ముషీరాబాద్, జూలై 20 (విజయక్రాం తి): కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ప్రజలు విసుగెత్తిపోయారని, రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ నాయకత్వంలోని పాలనను కోరుకుంటున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం మాజీ వైస్ చైర్మన్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్ కుమార్ అ న్నారు. భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో టిటీయూసీ నాయకులు బీఆర్టీయూలో చేరిక సభ హైదరాబాద్లోని సుందర య్య విజ్ఞాన కేంద్రంలో జరిగింది.
ఈ కార్యక్రమానికి బోయినపల్లి వినోద్ కుమార్తో పాటు మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాద వ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టిటీయూసీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు. దేవానంద్, కార్ పరమేశ్వర్, రామన్న, హరిబాబు, లక్ష్మణ్, ఎయిర్టెల్ రాజు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్మిక నాయకులు బీఆర్టీయూలో చేరారు. అనంతరం సభలో బోయినపల్లి వినోద్ కు మార్ మాట్లాడుతూ పోరాడి సాధించుకు న్న తెలంగాణ నేడు తెలంగాణ శత్రువుల చేతిలోకి వెళ్లిందని విమర్శించారు. కేసీఆర్ పదేళ్ల పాలనలో అన్నివర్గాల ప్రజలకు సం క్షేమ పథకాలు అందాయని, ప్రస్తుతం ప్రజ లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు.
కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం బీఆర్టీయూ ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. మాజీ మంత్రి వి. శ్రీని వాస్ గౌడ్ మాట్లాడుతూ కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు ప్రయోజనం పొందారని తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని విమర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర కల్లుగీత కార్మిక కార్పొరేషన్ మాజీ చైర్మన్ రవికుమార్ గౌడ్, మిని మం వేజ్ బోర్డు మాజీ చైర్మన్ నారాయణ, బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు మారయ్య. లక్ష్మణ్ మల్లికార్జున్ నేతలు పాల్గొన్నారు.






