21 July, 2026 | 10:42 PM

Breaking News

ఎల్ నీనో ప్రభావం ఉన్నందున రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి

21-07-2026 08:54 PM

ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

వంగపల్లి పిఎసిఎస్ పాలకవర్గం ప్రమాణ స్వీకారం

యాదగిరిగుట్ట,(విజయక్రాంతి): దేశంలో వ్యవసాయ పంటలో  రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉందని అయితే ఎల్ నీనో ప్రభావం ఉన్నందున వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో  రైతులు వరి పంట బదులు ఇతర వాణిజ్య పంటల పైన దృష్టి సారించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య అన్నారు. మంగళవారం యాదగిరిగుట్ట వంగపల్లి లో   పీఏసీఎస్ పాలకమండలి ప్రమాణ స్వీకారోత్సవంలో ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన పిఏసిఎస్ చైర్మన్  నెమ్మాని సుబ్రహ్మణ్యం, పాలకవర్గ సభ్యులతో కలిసి ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం ఏర్పాటు చేసిన సభలో బీర్ల అయిలయ్య  మాట్లాడుతూ... రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పంట రుణాలు, ధాన్యం కొనుగోలు, వ్యవసాయానికి సంబంధించిన అన్ని సేవలను పారదర్శకంగా అందించడంలో పి ఎ సి ఎస్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు.