22 May, 2026 | 8:28 PM

Breaking News

బోధన్ డివిజన్ పోలీస్ అధికారులతో నేరాల నియంత్రణ కోసం సమీక్ష సమావేశం -సిపి   •   బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాష్ట్ర పెరిక కార్పొరేషన్ చైర్మన్ దొంగరి వెంకటేశ్వర్లు   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   జిన్నారం ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలకు బ్రేక్..!   •   ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •  

పెన్షన్ దారులు సులభంగా పెన్షన్ అందుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు

22-05-2026 06:29 PM

మేడిపల్లి,(విజయక్రాంతి): రాష్ట్రవ్యాప్తంగా పెన్షన్ తీసుకుంటున్న పెన్షన్ దారులు సులభంగా పెన్షన్ అందుకునేందుకుగాను రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా  బ్యాంకు ఖాతా నందు పెన్షన్ జమ చేయబడుతున్న వారి వేలిముద్రలు, ముఖ గుర్తింపు ఒక యాప్ లో నమోదు చేసి పెన్షన్ తీసుకునే వెసులుబాటు రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. లైవ్ అతంటికేషన్ (జీవన నిర్ధారణ) పేరుతో ఉన్న యాప్ లో పెన్షన్ దారుల వివరాలు జూన్ 15 వరకు అధికారులు ప్రత్యేక డ్రైవ్ ద్వారా అందుబాటులోని ప్రభుత్వ కార్యాలయాలలో, వార్డ్ ఆఫీసుల్లో, పంచాయతీ కార్యాలయాల్లో సేకరిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో భాగంగా, బోడుప్పల్ సర్కిల్ ఆఫీస్, పీర్జాదిగూడ వార్డ్ ఆఫీస్ (ఓల్డ్ పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్) నందు ప్రత్యేకమైన విభాగాన్ని ఏర్పాటు చేసి పెన్షన్ దారుల వివరాలు సేకరిస్తున్నట్లు అధికారులు తెలిపారు. బ్యాంకు ఖాతా నందు పెన్షన్ జమ చేయబడుతున్న వారికి ఫోన్ కాల్స్ ద్వారా తెలియజేస్తున్నామని అన్నారు. సులభతరమైన పెన్షన్ పంపిణీ కొరకు ఈ కార్యక్రమాన్ని సజావుగా కొనసాగేలా పెన్షన్ దారులు తమతో  సహకరించాలని అన్నారు.