25 August, 2026 | 1:11 AM

ఏకగ్రీవంగా ట్రాక్టర్ల డ్రైవర్ యూనియన్ ఏకగ్రీవం

24-08-2026 10:41 PM

మాగనూరు: గ్రామ ట్రాక్టర్ల, డ్రైవర్ల యూనియన్ అధ్యక్షులుగా పెద్దింటి నరసింహులును ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సిఐటియు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పుంజునూరు ఆంజనేయులు ఆధ్వర్యంలో సోమవారం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ట్రాక్టర్ అండ్ డ్రైవర్ కమిటీ గౌరవ అధ్యక్షులుగా భరత్ కుమార్ (సిఐటియు),అధ్యక్షులుగా పెద్దింటి నరసింహులు, ఉపాధ్యక్షులుగా దండు వా బయ్య, పుంజనూరు నర్సింలు, కార్యదర్శిగా కొన్నింటి రమేష్,, 55 మంది తో కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగినది. కమిటీ గౌరవ అధ్యక్షులుగా సిఐటియు నాయకులు భారత్ కుమార్ ,కమిటీ అధ్యక్షులు పెద్దింటి నరసింహులు మాట్లాడదు గ్రామంలో ట్రాక్టర్ల  కిరాయి వెళ్లిన ఒకే ధర నిర్ణయించి పనులు చేయాలన్నారు. ట్రాక్టర్లు డ్రైవర్లకు ఏమైనా సంఘటన జరిగిన అందరూ కలిసికట్టుగా స్పందించ లని కోరారు. ఈ  కార్యక్రమంలో ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు, తదితరులు పాల్గొన్నారు.