3 July, 2026 | 5:14 PM

Breaking News

కాంగ్రెస్ కు ప్రచార ఆర్భాటాలు తప్ప ప్రజా సంక్షేమం పట్టదు   •   కామ్రేడ్ అరుణోదయ నాగన్న మృతి ఉద్యమానికి తీరని లోటు   •   కేటీఆర్, హరీష్ లకు వార్తల్లో నిలవాలన్న తాపత్రయం.!   •   ఈవీఎంల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   యూరియా రైతులకు సరిపడా అందించాలి   •   తెలంగాణలో ఏపీ పోలీసుల చర్యలు ఖండనీయం   •   సింగరేణి ప్రధాన కార్యాలయంలో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్ట   •   37వ డివిజన్లో 77 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన   •   నవ మహిళా సాధికార కేంద్రంలో మహిళలకు చెక్కుల పంపిణీ   •   పసికందు కిడ్నాప్.. 72 గంటల్లో కేసును చేదించిన పోలీసులు   •  

పీఈసెట్ ఫలితాలు విడుదల

18-06-2025 12:10 AM

బీపీఈడీలో 95 శాతం, డీపీఈడీలో 92 శాతం ఉత్తీర్ణత

హైదరాబాద్, జూన్ 17 (విజయక్రాంతి): బీపీఈడీ, డీపీఈడీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన తెలంగాణ ఫిజికల్ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (టీజీ పీఈసెట్) ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. ఈమేరకు మాసాబ్ ట్యాంక్ లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, వైస్ చైర్మన్ పురుషోత్తం, కార్యదర్శి శ్రీరామ్ వెంకటేష్, పీఈసెట్ చైర్మన్, పాలమూరు వర్సిటీ వీసీ జీఎన్ శ్రీనివాస్ ఫలితాలను విడుదల చేశారు.

రెండు కోర్సులకు కలిపి మొత్తం 2,557 మంది దరఖాస్తు చేసుకోగా, బీపీఈడీకు 1,307 మంది, డీపీఈడీకి 460 మంది కలిపి 1,767 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇందులో బీపీఈడీలో 1,252 (95.79 శాతం) మంది, డీపీఈడీలో 426 (92.61 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు.

బీపీఈడీ 16 కాలేజీల్లో 1,660 సీట్లు, డీపీఈడీ మూ డు కాలేజీల్లో 300 సీట్లు అందుబాటులో ఉన్నాయి. బీపీఈడీలో ఎస్ జ్యోతిర్మయి మొదటి ర్యాంకు, కేతావత్ రజిత రెండో ర్యాంక్, డీపీఈడీలో తుర్సా సీతామహాలక్ష్మి మొదటి ర్యాంక్, ముదావత్ నిఖిత రెండో ర్యాంకు సాధించారు.