22 May, 2026 | 10:27 PM

Breaking News

మైనర్లకు వాహనాలు ఇస్తే కఠిన చర్యలు   •   ప్రభాకర్ ఆశయ సాధనకు కృషి చేయాలి   •   సీఎం, డిప్యూటీ సీఎం చిత్రపటాలు ఏర్పాటు చేయాలి   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన నేపథ్యంలో ఏర్పాట్లను పరిశీలించిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   పేకాట స్థావరంపై దాడి   •   వన్య ప్రాణులను అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తుల అరెస్టు, రిమాండ్   •   మద్యం సేవించి మహిళపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నకిలీ విలేకరులు   •   చందుర్తి మండలంలో డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు ప్రత్యేక తనిఖీలు   •   ఆనందోత్సాహాల మధ్య ఆత్మీయ సమ్మేళనం   •   శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న కంచి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ శంకర విజయేంద్ర సరస్వతి   •  

సమన్వయంతో పార్టీని ముందుకు తీసుకెళ్లాలి

15-03-2026 02:16 PM

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పార్టీని మరింత బలోపేతం చేయాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తేనే పార్టీపై ప్రజల్లో విశ్వాసం పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు.

గోలేటి గ్రామ పంచాయతీకి చెందిన వార్డు సభ్యులు జమ్మిడి అరుణ్ , మిడిగొండ లక్ష్మి - లింగమూర్తి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోవ లక్ష్మి వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారు పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని హామీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ  గ్రామ స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకమై పనిచేయాలని పిలుపునిచ్చారు.