19 June, 2026 | 1:38 AM

ఓటరు జాబితా రూపకల్పనలో భాగస్వామ్యం అవసరం

19-06-2026 12:09 AM

కలెక్టర్ చాహాత్ బాజ్పాయి

హనుమకొండ, జూన్ 18(విజయ క్రాంతి): ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాది అయిన ఓటరు జాబితాను మరింత సమగ్రమైనదిగా, విశ్వసనీయమైనదిగా తీర్చిది ద్దేందుకు భారత ఎన్నికల సంఘం చేపట్టిన ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ కార్యక్రమం (ఎస్‌ఐఆర్-2026)లో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి చాహాత్ బాజ్పాయి పిలుపునిచ్చారు.

ఎస్‌ఐఆర్-2026పై ఓటర్లలో అవగాహన పెంపొందిం చేందుకు జిల్లా ఎన్నికల యంత్రాంగం ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన 2కె రన్ను హనుమకొండ అదాలత్ సర్కిల్లోని జిల్లా వి ద్యాశాఖ అధికారి కార్యాలయం వద్ద డిసిపి ధార కవితలో కలసి కలెక్టర్ ఛాహాత్ బాజ్ పాయి ప్రారంభించారు. అక్కడి నుంచి జి ల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ ఉత్సాహంగా సా గింది.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల ప్రక్రియపై ప్రజల విశ్వాసా న్ని మరింత బలోపేతం చేయడంలో ఖచ్చితమైన ఓటరు జాబితా కీలక పాత్ర పోషి స్తుందని పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పౌరు డు తన పేరు ఓటరు జాబితాలో నమోదైం దో లేదో పరిశీలించుకోవడంతో పాటు అ వసరమైన సవరణలు, మార్పులు, చేర్పు లు చేసుకోవాలని సూచించారు.

ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం జూన్ 25 నుం చి జూలై 24 వరకు బూత్ లెవల్ అధికారులు (బీఎల్‌ఓలు), రాజకీయ పార్టీల బూ త్ లెవల్ ఏజెంట్ల (బీఎల్‌ఏలు) సమక్షంలో ఇంటింటికీ వెళ్లి డిక్లరేషన్ ఫారాలు, ఎన్మరేషన్ ఫారాలను పంపిణీ చేస్తారని తెలిపా రు. ప్రజలు ఈ ప్రక్రియకు సహకరించి సరై న సమాచారాన్ని అందించాలని కోరారు.

సేకరించిన వివరాల ఆధారంగా జూలై 31న ముసాయిదా ఓటరు జాబితా ప్రచురించబడుతుందని, అభ్యంతరాలు, క్లెయిమ్ల పరిశీలన అనంతరం అక్టోబర్ 1న తుది ఓ టరు జాబితా విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎవరైనా తప్పు సమాచారం అందిం చిన సందర్భాల్లో నేరుగా పేరు తొలగించకుండా, నోటీసు జారీ చేసి విచారణ నిర్వ హించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.

శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు, మరణించిన వ్యక్తులు, ఒకటి కంటే ఎక్కువ చోట్ల నమోదైన డూప్లికేట్ ఓటర్ల వివరాలను గుర్తించి జాబితాను పరిశుద్ధీకరించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఓటరు జాబితాలో పేరు లేని అర్హులైన పౌరులు తప్పనిసరిగా ఫారం-6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.