4 April, 2026 | 8:30 PM

మెరుగైన విద్యుత్ సరఫరా కల్పిస్తాం

04-04-2026 06:38 PM

నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా మున్సిపాలిటీ పరిధిలోని 6వ వార్డులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్‌ను శనివారం స్థానిక ఎమ్మెల్యే డా. కూచుకుళ్ల రాజేష్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలో విద్యుత్ సరఫరా సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు.

కొత్తగా ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్ వల్ల 6వ వార్డు పరిధిలో విద్యుత్ ఒత్తిడి తగ్గి ప్రజలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందుతుందని పేర్కొన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ ఏర్పాటు చేసినందుకు స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, విద్యుత్ శాఖ డిఈ శ్రీధర్, కౌన్సిలర్ శ్రీనివాసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు ప్రజలు పాల్గొన్నారు.