4 April, 2026 | 8:37 PM

ఎంజీఎంను ఆకస్మికంగా సందర్శించిన కలెక్టర్ డా. సత్య శారద

04-04-2026 06:51 PM

హనుమకొండ,(విజయక్రాంతి): ఆసుపత్రిలో అందిస్తున్న వైద్య సేవలను సమీక్షించేందుకు వివిధ విభాగాలను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారదా దేవి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్  ఆసుపత్రి లోని పలు వార్డులు, అత్యవసర విభాగం, ఔట్‌పేషంట్ విభాగం తదితరాలను సందర్శించి అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో నేరుగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. రోగులు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకొని, వాటిని వెంటనే పరిష్కరించేందుకు అధికారులకు సూచనలు ఇచ్చారు.

అనంతరం ఆసుపత్రి వైద్యులు మరియు సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్  మాట్లాడుతూ, రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని సూచించారు. ఆసుపత్రిలో పరిశుభ్రత, ఔషధాల లభ్యత, సిబ్బంది సమయపాలన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన సేవలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని వైద్యులను ఆదేశించారు. రోగులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు.