28 March, 2026 | 4:28 PM

Breaking News

సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •   'తొలి ముద్ద'.. బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం.. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం   •   కిషన్ రావుపేటలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన   •   కూసుమంచి తహాశీల్దారుగా సైదులు బాధ్యతలు స్వీకరణ   •   ఘనంగా రావి వీరవేన్లయ్య 34 వర్ధంతి   •  

పాలమూరు బిడ్డ పాలమూర్ రంగారెడ్డి ప్రాజెక్టు పడావు పెట్టడమే కాకుండా దుష్ప్రచారం

25-03-2026 12:07 AM

జూరాల ప్రాజెక్టు ఆయకట్టుకు క్రాఫ్ హాలిడే

పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆయకట్టుకు సాగునీటితో జలకళ

రైతులు, నాయకులతో గుడిపల్లి రిజర్వాయర్ పరిశీలన 

మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డీ 

వనపర్తి, మార్చి 24 (విజయక్రాంతి): పాలమూరు బిడ్డగా చెప్పుకునే సి ఎం రే వంత్ రెడ్డీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పడావు పట్టడమే కాకుండా దుష్ప్ర చారం చేస్తున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డీ దుయ్యబట్టారు. మంగళవా రం జిల్లా, స్థానిక నాయకులు, రైతులతో కలిసి రేవల్లి మండల పరిధిలో గల గుడిపల్లి రిజర్వాయర్ ను ఆయన పరిశీలించారు.

ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి పాలమూరు జిల్లాలో మిగిలిన 35లక్షల ఎకరాల కు సాగు నీళ్లు అం దించి రైతులను రాజులను చేయాలన్న సంకల్పంతో మాజీ సి ఎం కె.సి.ఆర్ నీటి లభ్యత ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు దగ్గర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని 90శాతం పూర్తి అయిన పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ప్రస్తుత ప్రభుత్వం తట్టెడు మట్టి తీయకుండా పడావు పెట్టిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని ఆయన విమర్శించారు. 27వేల ఎకరాల భూసేకరణ జరిపి 32వేలకోట్ల ఖర్చు చేసి 27వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించి నిర్మాణం చేపట్టడం జరిగిందని కేవలం 1000కోట్లు ఖర్చు చేసి 10శాతం పనులు పూర్తి చేయకుండా కాంగ్రెస్ నిర్లక్ష్యం చేస్తుందని ఆయన విమర్శించారు.

శ్రీశైలం లో బురద వచ్చే వరకు నీటిని తోడే అవకాశం ఉంటుందని ఆ దిశగానే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ను అదే లెవెల్ లో పనులు చేయడం జరిగిందని డెడ్ స్టోరేజ్ వరకు నీటిని పంపింగ్ చేయవచ్చనన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ జూరాల వద్ద చేపడితే నీటిని పంపింగ్ చేయలేమని శ్రీశైలం నుండి 45 రోజుల్లో తొంబై టీ ఏం సి లు ఎత్తి పోయవచ్చని నీటి లభ్యత లేని జూరాల దగ్గర పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు నిర్మాణం చేయాలని చెప్పడం రైతులను మోసం చేయడం కోసమేనని అయన దుయ్యబట్టారు. 

జూరాల ప్రాజెక్టు లో నీటి నిల్వ తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో రైతులకు క్రాప్ హాలిడే ప్రకటించారాని నీళ్ల సోర్స్ ఉన్న శ్రీశైలం బ్యాక్ వాటర్ నుండి కాకుండా క్రాప్ హాలిడే ప్రకటించే జూరాల దగ్గర అనడం వెనుక అంత్యర్యం ఏమిటో వారికే తెలియాలన్నారు మాజీ మంత్రి వెంట వెంట గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, నందిమల్ల అశోక్, భీమయ్య, కౌన్సిలర్ మురళి సాగర్, తదితర నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, స్థానిక రైతులు పాల్గొన్నారు.