22 April, 2026 | 1:41 PM

Breaking News

మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు మృతిపట్ల రేవంత్ రెడ్డి సంతాపం   •   ఆర్టీసీ సమ్మె వేళ... ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్   •   ఉప్పల్ బస్ డిపో ముందు ఆర్టీసీ కార్మికులతో తీన్మార్ మల్లన్న ధర్నా   •   మాజీ సీఎం నాదెండ్ల భాస్కరరావు కన్నుమూత   •   కాళేశ్వరంపై నిందలు వేసి... కేసీఆర్ ప్రతిష్ట దెబ్బతీసేందుకు కుట్ర   •   కట్టుదిట్టమైన పర్యవేక్షణతో నాణ్యమైన రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలి   •   ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి   •   గంజి చంద్రమౌళి మృతి కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు   •   రేవంత్ రెడ్డి నిజస్వరూపం... హైకోర్టు తీర్పుతో తేటతెల్లం   •   పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •  

షూటింగ్ వరల్డ్‌కప్‌లో భారత్ సంచలనం: పాలక్-ముకేశ్ గోల్డ్… వరల్డ్ రికార్డ్ బ్రేక్!

08-04-2026 01:19 AM

షూటింగ్ వరల్డ్‌కప్‌లో భారత్‌కు స్వర్ణం

స్పెయిన్, ఏప్రిల్ 7: ఇంటర్నేషనల్ షూటింగ్ స్పోర్ట్స్ ఫెడరేషన్ (ఐఎస్‌ఎస్‌ఎఫ్) వరల్డ్‌కప్‌లో భారత షూటర్లు పాలక్, ముకేశ్ చరిత్ర సృష్టించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో 487.7 స్కోరుతో స్వర్ణ పతకం గెలుచుకున్నారు. ఇప్పటి వరకు ఇదే అత్యుత్తమ స్కోరుగా నమోదైంది.

భారత క్రీడా విజయాలు, అంతర్జాతీయ టోర్నమెంట్ అప్‌డేట్స్ కోసం మా స్పోర్ట్స్ సెక్షన్‌ను చూడండి

దీనిలో పాలక్ 243, ముకేశ్ 244.7 పాయింట్లు సాధించారు. దీంతో ఆసియా షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఉజ్బెకిస్థాన్‌కు చెందిన నిజినా,కమలోవ్ జోడీ నెలకొల్పిన 481.3 పాయింట్ల రికార్డును బ్రేక్ చేశారు. ఆసియా క్రీడల్లో ఛాంపియన్‌గా నిలిచిన పాలక్ గులియా , ముకేశ్‌తో కలిసి ఫైనల్స్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. ఈ క్రమంలో చైనా, హంగేరీ, యూఎస్‌ఏలకు చెందిన షూటర కంటే పైచేయి సాధించారు.ఇదిలా ఉంటే ఈ పోటీల్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత షూటర్లు ఫైనల్‌కు అర్హత సాధించలేకపోయారు.

ఇండియా స్పోర్ట్స్ న్యూస్, షూటింగ్ అప్‌డేట్స్ కోసం Homepage క్లిక్ చేయండి