8 May, 2026 | 2:48 AM

వడ్ల కొనుగోలు సెంటర్లను వెంటనే ప్రారంభించాలి

08-05-2026 12:00 AM

గట్టు మే 7:రాష్ట్ర ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తుందని రైతులు పండించిన పంట కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని గద్వాల బీఆర్‌ఎస్  ఇన్చార్జి బాసు హనుమంత నాయుడు అన్నారు.ఈ మేరకు గురువారం గట్టు మండలం మాచర్ల గ్రామంలో వడ్ల డంపింగ్ ను రైతులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా  మాట్లాడుతూ... రైతులు 25 రోజుల నుంచి వడ్లను డంపింగ్ చేసిన కొనుగోలు కేంద్రం  ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు.

కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయకపోతే రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సాగునీరు,కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. పిఎసిఎస్  సంబంధిత అధికారులకు ఫోన్లో సంప్రదించి వెంటనే కొనుగోలు సెంటర్లను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు రైతులు తదితరులు పాల్గొన్నారు