పీఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకరణ
07-05-2026 01:23 AM
కల్వకుర్తి మే 6: ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పాలకవర్గ గడువు ముగియడంతో రాష్ట్ర ప్రభుత్వం వాటిని రద్దు చేసి ప్రత్యేక అధికారులతో పాలన కొనసాగించాలని నిర్ణయించింది. అయితే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మాజీ పాలకవర్గ సభ్యులు కోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో కోర్టు తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు గతంలో పనిచేసిన పాలకవర్గాన్ని కొనసాగించాలని సూచించడంతో దీంతో బుధవారం కల్వకుర్తి పిఎసిఎస్లో గత పాలకవర్గ సభ్యులు మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. చైర్మన్ గా జనార్దన్ రెడ్డి , వైస్ చైర్మన్గా శ్యామ్ బాధ్యతలు చేపట్టారు. కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సిబ్బంది వారికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు.






